శృతి హాసన్, తమన్నా లిప్ లాక్ సంచలనం!

16 Jul, 2014 14:33 IST|Sakshi
శృతి హాసన్, తమన్నా లిప్ లాక్ సంచలనం!
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో లిప్ లాక్ ల హవా కొనసాగుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ వ్యవహారాలు చాలా సాధారణవుతున్నాయనుకున్నారేమో టాలీవుడ్ భామలు ఓ సంచలనానికి తెర తీశారు. 
 
దక్షిణాది, బాలీవుడ్ లో కూడా తమ గ్లామర్ తో  వేడి పుట్టిస్తున్న శృతి హసన్, తమన్నాలిద్దరూ  ఓ ప్రైవేట్ పార్టీలో లిప్ లాక్ చేశారంటూ బయటకు పొక్కిన వార్త దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. చెన్నైలో ఈ జరిగిన ఓ విందుకు హాజరైన తమన్నా, శృతి హాసన్ లిద్దరూ బహిరంగ ప్రదేశంలో కౌగింతలు, లిప్ లాక్ ల్లో మునిగిపోయారట. 
 
ఆతర్వాత వారెవరిని పట్టించుకోకుండా సుదీర్ఘ సంబాషణల్లో మునిగిపోయినట్టు తెలిసింది. చెన్నైలో శృతి హసన్ తో గడపడం చాలా బాగుంటుంది అని తమన్నా ట్విట్ చేయడం గమనార్హం.  ఫోటోలు లీక్ అయ్యాయి. లీకైన ఫోటోలు ఈ అభిమానుల మొబైల్స్ లో హడావిడి సృష్టిస్తున్నాయి.