లక్‌  కరెక్ట్‌ కాదు

1 Apr, 2019 00:01 IST|Sakshi

సౌత్‌ కథానాయికలు ఎవరైనా బాలీవుడ్‌లో సత్తా చాటాలని ఆశపడుతుంటారు. ఆల్రెడీ జయప్రద, శ్రీదేవి, రేఖ వంటి ప్రముఖ కథానాయికలు దక్షిణాది నుంచి వెళ్లి అక్కడ హీరోయిన్లుగా అగ్రస్థాయికి ఎదిగారు. అయితే బాలీవుడ్‌ చాన్స్‌ అందరికీ వెంటనే రాదు. కానీ కమల్‌హాసన్‌ పెద్ద కుమార్తె శ్రుతీహాసన్‌ సినీ ప్రస్థానం ‘లక్‌’ (2009) అనే హిందీ చిత్రంతోనే ఆరంభం అయ్యింది. కానీ ఆమె అక్కడ పెద్ద ఫేమస్‌ కాలేదు. ‘లక్‌’ చిత్రం సరిగ్గా ఆడకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాని శ్రుతి గుర్తు చేసుకుంటూ– ‘‘అప్పటికి సినిమాల గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కథానాయికగా నటించడానికి సిద్ధంగా లేను. అకస్మాత్తుగా సంగీత ప్రపంచం నుంచి వచ్చి హీరోయిన్‌గా కెమెరా ముందుకు వచ్చాను.

‘లక్‌’ చిత్ర ప్రయాణంలో సినిమా అంటే ఏంటో నాకు అర్థం అయ్యింది.  ఓ సినిమా వెనక ఉండే  కష్టం, విలువ నాకు తెలిసొచ్చాయి. ‘లక్‌’కు మేము ఊహించిన స్పందన రాలేదు. సినిమా సక్సెస్‌ కావొచ్చు. ఫెయిల్‌ కావొచ్చు. నేను తీసుకున్న నిర్ణయం అది. వేరే వారిని కారణంగా చెప్పలేను. కానీ ఆ తర్వాత ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదనిపించింది. ఆ అనుభవాన్ని మాత్రం ఓ పాఠంలా అనుకుని కెరీర్‌లో ముందుకు వెళుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్‌. ప్రస్తుతం శ్రుతి బాలీవుడ్‌లో మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విద్యుత్‌ జమాల్‌ ఇందులో హీరో. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా