ఊ కొట్టారా? ఊహూ అన్నారా?

31 Mar, 2018 04:00 IST|Sakshi

ఆల్మోస్ట్‌ తొమిదేళ్ల క్రితం ‘లక్‌’ సినిమాతో బీటౌన్‌లో కథానాయికగా అడుగుపెట్టారు శ్రుతీహాసన్‌. ఆ తర్వాత అరడజనుకు పైగా హిందీ సినిమాలు చేసినప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఆపలేదు. అందులో భాగంగానే బాలీవుడ్‌లో ఆమె మరో ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారని టాక్‌. యాక్షన్‌ స్టార్‌ విద్యుత్‌ జమాల్‌ హీరోగా మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతీహాసన్‌ను సంప్రదించారట చిత్రబృందం. స్క్రిప్ట్‌ విని ఎగై్జట్‌ అయ్యారట శ్రుతి. ఇక అధికారికంగా ఎనౌన్స్‌మెంట్‌ రావడమే ఆలస్యం.  ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే... ఆల్రెడీ ‘యారా’ అనే చిత్రంలో విద్యుత్‌ జమాల్, శ్రుతీహాసన్‌ జంటగా నటించారు. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా రషెస్‌ చూసి విద్యుత్‌తో శ్రుతీ కెమిస్ట్రీ బాగుందని టీమ్‌ మెంబర్స్‌ కూడా భావించారని బీటౌన్‌ టాక్‌.ఒకవేళ ఈ సినిమాకు ఓకే చెబితే ఫారిన్‌ రిటర్న్‌ అమ్మాయి పాత్రలో నటించనున్నారట శ్రుతి.

మరి.. ప్రచారంలో ఉన్నట్లు శ్రుతి ఈ ప్రాజెక్ట్‌కి ఊ కొట్టారా? ఊహూ అన్నారా? అనేది తెలియాలంటే వెయిట్‌ అండ్‌ సీ. బాలీవుడ్‌లో శ్రుతీ నటించిన చివరి చిత్రం ‘బెహన్‌ హోగి తేరి’. ఈ చిత్రం గతేడాది రిలీజైన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే.. తెలుగులో ‘కాటమరాయుడు’ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ 12 నెలల్లో శ్రుతి తమిళ చిత్రాలకు కూడా ‘ఊ’ కొట్టలేదు. మంచి కథ, పాత్ర అయితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలనుకుంటున్నారట. లేకపోతే ‘ఊహూ’ అన్నదే ఈ బ్యూటీ సమాధానం అని పరిశీలకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు