శ్రుతి రహస్య వివాహం..?

7 Dec, 2017 07:20 IST|Sakshi

సాక్షి , సినిమా: నటుడు కమలహాసన్‌ వారసురాలు, నటి శ్రుతీహాసన్‌ తాజాగా మరోసారి వార్తల్లో కెక్కారు.  శ్రుతికి ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. లండన్‌కు చెందిన మైఖేల్‌ కోర్సెల్‌తో శ్రుతీహాసన్‌ చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ముంబైలో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌ను తల్లి సారికకు పరిచయం చేశారు. వీరు ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.  తాజాగా శ్రుతీహాసన్, తన బాయ్‌ ఫ్రెండ్‌ను రహస్య వివాహం చేసుకున్నట్లు వైరల్‌ అవుతోంది.

శ్రుతి పట్టుచీరతో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ పట్టుపంచె, చొక్కాలతో దర్శనమిచ్చిన ఫోటోలు.. ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రచారానికి దోహదమయ్యాయి. విశేషం ఏమి టంటే ఈ ఫొటోలో నటుడు కమలహాసన్‌ కూడా పట్టు వస్త్రాల్లో ఉన్నారు. దీంతో నిజంగానే శ్రుతి పెళ్లి జరిగిపోయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే బుధవారం దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్‌ మనవడు ఆదవ్‌ వివాహం జరిగింది. ఈ వివాహాంలో  నటుడు కమలహాసన్, కూతురు శ్రుతిహాసన్, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌లు పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు