శృతికి జాక్‌పాట్‌

20 Jun, 2019 10:13 IST|Sakshi

నటి శృతీహాసన్‌ బ్రేక్‌ను బ్రేక్‌ చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ వరుస పెట్టి చిత్రాలు చేసిన ఈ సంచలన హీరోయిన్‌ ఆ తరువాత సుమారు రెండేళ్లు తెరపై కనిపించలేదు. అంతే కాదు నటనకు బ్రేక్‌ ఇచ్చారు. తరచూ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశారు. అయితే తాను సినిమాల్లో నటించకపోయినా ఖాళీగా లేనని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ తన ఫ్రెండ్స్‌తో కలిసి సంగీత ఆల్బమ్స్‌ రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు.

ఆ మధ్య బుల్లితెరపై రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా మెరిశారు. ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరిగా సింగం 3లో కనిపించారు. అదేవిధంగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కాటమరాయుడు చిత్రంలో నటించారు. ఇక తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటించిన శబాష్‌నాయుడులో నటించినా, ఆ చిత్రం మధ్యలోనూ ఆగిపోయింది. ఆ తరువాత కొన్ని చిత్రాలను నిరాకరించారనే ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. 

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్‌ అయిన తరువాత ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు శృతి. కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన ఒక చిత్రం, టాలీవుడ్‌లో రవితేజ్‌తో ఒక చిత్రం అంగీకరించారు.  అవును ఈ అందాల భరిణి హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చే జాక్‌పాట్‌ను కొట్టేసిందని తెలిసింది. ఒక హాలీవుడ్‌ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించడానికి ఓకె చెప్పారు శృతి. ప్రఖ్యాత లాసన్‌ బోర్మీ యూరనివర్స్‌ సంస్థ నిర్మించనున్న ట్రెడ్‌స్టోన్‌ సిరీస్‌లో శృతిహాసన్‌ నటించనున్నారు.

ఈ సిరీస్‌లో ఢిల్లీలో ఒక హోటల్‌లో పని చేస్తూ ఇతర సమయాల్లో హత్యలు చేసే యువతిగా నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్‌ ప్రాంతంలో జరగనున్న ఈ సిరీస్‌ షూటింగ్‌లో త్వరలోనే శ్రుతిహాసన్‌ పాల్గొననున్నారు. మొత్తం మీద నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడిప్పుడు ఆ బ్రేక్‌ను బ్రేక్‌ చేస్తున్నారన్న మాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!