ఒక్క ఫ్రేమ్‌ అశ్లీలత లేకుండా...

30 Oct, 2018 03:08 IST|Sakshi
విద్యాసాగర్, రాధాకృష్ణ, సాయి శ్రీనివాస్, ప్రియ, జనార్థన్, బెల్లం రామకృష్ణారెడ్డి

‘‘ఈ మధ్య వస్తున్న కొన్ని చిత్రాలు కుటుంబంతో కలసి చూసేలా ఉండటం లేదు. కానీ ‘శుభలేఖ+లు’ చిత్రం సకుటుంబంతో చూడొచ్చు. నాకు చాలా నచ్చింది. ఒక్క ఫ్రేమ్‌ కూడా అశ్లీలంగా అనిపించలేదు. అందుకే ఈ సినిమాను కొన్నాను. డిసెంబర్‌ 7న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణారెడ్డి. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్‌ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్‌.ఆర్‌. జనార్థన్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 7న బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు శరత్‌ మాట్లాడుతూ –  ‘‘యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా మాది. యువతని పెద్దలు ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్‌ని చూపించాం. నిర్మాతలు మంచి సపోర్ట్‌ అందించారు. రాధాకృష్ణ సంగీతం స్పెషల్‌ హైలైట్‌’’ అన్నారు.‘‘కంటెంట్‌ని నమ్మి ప్రారంభించిన సినిమా ఇది. నచ్చి బెల్లం రామకృష్ణా రెడ్డి థియేట్రికల్, శాటిలైట్‌ హక్కులను కొనుక్కున్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత జనార్థన్‌. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శరత్‌ మేలు ఎప్పటికీ  మర్చిపోలేను’’ అన్నారు హీరో.

మరిన్ని వార్తలు