ఒకరికి ఒకరు

1 Nov, 2018 02:33 IST|Sakshi
మిషాల్, హేమలత

మిషాల్‌ శైలేష్‌ జైన్, హేమలత జంటగా వి.ఎస్‌. ఫణీంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శుక్రా ప్రొడక్షన్స్‌ పతాకంపై సంజీవ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సంజీవ్‌ కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు సత్యప్రకాశ్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ ఫణీంద్రగారు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేస్తున్నా.  సత్యప్రకాశ్‌ మా సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఒకరికొకరు అనుకునే ప్రేమలో ఒకరు పోతే మరొకరు అనే ధోరణి వచ్చింది. ఇలా ఎందుకు? అని ఆలోచించుకుని రాసుకున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ మూవీ ఇది. చక్కటి కథతో మంచి టీమ్‌తో చేస్తున్నా. ఈ చిత్రంలో సత్యప్రకాశ్‌గారిని కొత్త కోణంలో చూస్తారు. హర్ష ప్రవీణ్‌ మంచి సంగీతం అందించారు’’ అన్నారు వీఎస్‌ ఫణీంద్ర. ఈ చిత్రానికి కెమెరా: అలీ.

మరిన్ని వార్తలు