అవును.. నిజమే

4 Jun, 2018 00:40 IST|Sakshi
శ్వేతాబసు ప్రసాద్‌

‘కొత్తబంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరోయిన్‌ శ్వేతాబసు ప్రసాద్‌. అప్పట్లో ఆమె వరుసగా సినిమాలు చేసినా ఆ తర్వాత స్లో అయ్యారు. వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. ఇప్పుడు శ్వేతా గురించి బాలీవుడ్‌లో ఓ హాట్‌ న్యూస్‌ హల్‌ చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌తో శ్వేతా బసు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని,  గతేడాదే వీళ్ల నిశ్చితార్థం జరిగిందన్నది ఆ న్యూస్‌. ఆ వార్తలకు శ్వేతాబసు స్పందిస్తూ ‘‘రోహిత్‌తో నా ఎంగేజ్‌మెంట్‌ జరిగిన మాట వాస్తవమే. మేం ఇద్దరం కూడా మా పర్శనల్‌ లైఫ్‌ ప్రైవేట్‌గా ఉండాలని కోరుకునేవాళ్లమే.

అందుకే ఈ విషయం గురించి బయట మాట్లాడలేదు’’ అని పేర్కొన్నారామె.  విశేషం ఏంటంటే... వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషించారట. తన దగ్గర స్క్రిప్ట్‌ కన్‌సల్టెంట్‌గా ఉన్న శ్వేతాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న రోహిత్‌కు పరిచయం చేసింది అనురాగ్‌ కశ్యపే అని సమాచారం. వీళ్ల లవ్‌స్టొరీలో మొదట గోవాలో రోహిత్‌కు  శ్వేతా ప్రపోజ్‌ చేయగా, పూణేలో శ్వేతాకు రోహిత్‌ ప్రపోజ్‌ చేశారట. వచ్చే ఏడాదిలో వీళ్లిద్దరి పెళ్లి ఉండొచ్చని బాలీవుడ్‌ సమాచారం.  ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్‌లో ‘ది తస్కెంట్‌ ఫైల్స్‌’ అనే పొలిటికల్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా