పెళ్లి పీటలెక్కనున్న శ్వేతా బసు ప్రసాద్‌

28 Nov, 2018 18:33 IST|Sakshi

మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు నటి శ్వేతా బసు ప్రసాద్‌. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ తర్వాత పూర్తిగా ముంబైకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్వేతా బసు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ను శ్వేతా వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత అదే వారంలో ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్వేత తన కాబోయే భర్త, స్నేహితులతో కలిసి ఇండోనేషియా, బాలీలో బ్యాచిలర్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

Let. The. Bachelorette. Begin!

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

ఈ విషయం గురించి శ్వేతా స్నేహితురాలు మాట్లాడుతూ.. శ్వేతా, రోహిత్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వారు రిలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఇద్దరూ బెస్ట్‌ కపూల్స్‌ మారబోతున్నారు. ఈ క్షణాల కోసం మేమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అబ్బాయిలే ముందు ప్రపోజ్‌ చేయాలనేది పాత మాట. ఇద్దరి మధ్య ఒకే రకమైన భావాలు ఉన్నప్పుడు ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారనేది ముఖ్యం కాదు. శ్వేతానే ముందుగా ప్రపోజ్‌ చేసింది. గోవా వెళ్లినప్పుడు శ్వేత, రోహిత్‌కు ప్రపోజ్‌ చేసింది. తర్వాత రోహిత్‌ పూణెలో ఎస్‌ చెప్పాడు అంటూ చెప్పుకొచ్చారు.

I love cheap thrills! @rahul_prasad3 #bachelorette #bali 💃🏻

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు