వాటికి నా ఆన్సర్‌ ‘నో’ అని చెప్తాను

12 Jul, 2020 06:36 IST|Sakshi

శ్వేత త్రిపాఠి... మల్టీప్లెక్స్, ఓటీటీతో పరిచయం ఉన్నవాళ్లందరికీ తెలిసిన నటి. తన నటనా సామర్థ్యాన్ని సవాలు చేసే పాత్రలంటే అమితమైన అభిమానం ఆమెకు. 

బర్త్‌ ప్లేస్‌ ఢిల్లీ. తండ్రి ఐఏఎస్‌ ఆఫీసర్‌. తల్లి టీచర్‌. ఇద్దరు తోబుట్టువులు.. అక్క, తమ్ముడు.  భరతనాట్యం, కథక్‌ నృత్యాల్లో  శిక్షణ పొందింది. ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చదివింది.

యాక్టింగ్‌లో భవిష్యత్‌ను వెదుక్కుందామని ముంబై వచ్చి ఫొటోగ్రఫీ ప్రేమలో పడిపోయింది. ఫెమినా మ్యాగజైన్‌లో ఫొటో ఎడిటర్‌గా చేరింది. 

నటనలో తర్ఫీదు తీసుకోవడానికి నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో చేరమని సన్నిహితులు చెప్పారు. కాని ఫ్యాషన్‌ డిగ్రీ కోసం అప్పటికే నాలుగేళ్ల చదువు ఎక్కవనుకున్న శ్వేత యాక్టింగ్‌ కోసం ఎన్‌ఎస్‌డీలో మళ్లీ మూడేళ్లు వెచ్చిచండం వేస్ట్‌ అనుకుంది. అందుకే షార్ట్‌కట్‌ను ఎంచుకుంది తన టాలెంట్‌కు మెరుగులు దిద్దుకోవడానికి.. ఎన్‌ఎస్‌డీ డైరెక్టర్‌ (అప్పటి) నిర్వహించిన ఆర్నెల్ల వర్క్‌షాప్‌కు హాజరై.

కెమెరా కంటే ముందు కెమెరా వెనక పనిచేసింది అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా. సినిమాల్లో కంటే ముందు టెలివిజన్‌ సీరియల్‌లో కనిపించింది. ఆమె ఫస్ట్‌ టెలివిజన్‌ షో... క్యా మస్త్‌ హై లైఫ్‌. తొలి సినిమా..  మసాన్‌. 

థియేటర్‌ (నాటకాలు) అంటే కూడా శ్వేతకు చాలా ఇష్టం. ఒకవైపు ఫెమినాలో ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు థియేటర్‌లో ఎక్స్‌పరిమెంట్స్‌ చేసేది. ఫెమినా జాబ్‌ వదిలేశాక నాటకాల కోసం ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించింది 
‘ఆల్‌ మై టీ (All My Tea)  ప్రొడక్షన్స్‌’ పేరుతో. 

నాట్యం, స్కూబా డైవింగ్, ట్రావెలింగ్,  రీడింగ్‌ అంటే కూడా ఆమెకు ఆసక్తే. దంగల్‌ ఆడిషన్స్‌కు వెళ్లింది... కాని ఆ పాత్రకు ఫాతిమా సనా షేఖ్‌ ఖరారు అయింది. 

‘‘అలా ఏరికోరి ఎందుకు ఎంచుకుంటావ్‌.. వచ్చిన అవకాశాలన్నిటినీ అందుకోక? అని నా శ్రేయోభిలాషులు చాలామంది సలహాలిస్తూంటారు. కాని నేనలా చేయలేను. ఆర్టిస్ట్‌గా నేనేం చేస్తున్నానో జనాలు గమనిస్తారు. సినిమాల్లోనే కాదు ప్రకటనల విషయంలోనూ ఆ ఎరుకతో ఉంటా. అందుకే ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్, ఫాస్ట్‌ ఫుడ్‌ ప్రమోషన్‌ యాడ్స్‌కు నేను దూరం. వాటికి నా ఆన్సర్‌ ‘నో’ అని చెప్తుంది శ్వేత త్రిపాఠి.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా