మరోసారి భయపెడతారట

26 Jun, 2018 00:51 IST|Sakshi
కేథరిన్, సిద్ధార్థ్‌

ట్రైలింగువల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘గృహం’తో సక్సెస్‌ ట్రాక్‌లో పడ్డ సిద్ధార్థ్‌ తమిళంలో ఓ కొత్త చిత్రం  మొద్దలెట్టారు. సాయి శేఖర్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కేథరిన్‌ తెరీసా జంటగా యాక్ట్‌ చేయనున్నారు. ట్రిడెంట్‌ ఆర్ట్‌ బ్యానర్‌ నిర్మించనుంది. ఈ సినిమా కూడా హారర్‌ జానర్‌లోనే ఉండబోతోందట. ఫస్ట్‌ టైమ్‌ సిద్దార్థ్, కేథరిన్‌ జోడీ కడుతున్నారు. యస్‌.యస్‌ థమన్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ఏకాంబరం కెమెరా అందించనున్నారు. అన్నట్లు.. నాలుగైదేళ్లుగా సిద్ధార్థ్‌ ఫుల్‌ బిజీగా సినిమాలు చేయడంలేదు. సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్‌ తీసుకుంటున్నారు. మరి.. ఇక స్పీడ్‌ పెంచుతారా? స్లో అండ్‌ స్టడీ అన్నట్లుగానే ఉంటారా?

మరిన్ని వార్తలు