అబ్బాయిగా నటించడం ఈజీ కాదు

18 Jun, 2018 01:23 IST|Sakshi
సిద్ధి ఇద్నాని

‘‘మా నాన్న సింధీ. మా అమ్మ గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. మా అమ్మ హిందీ టెలివిజన్‌ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. చిన్నప్పుడు అమ్మతో కలిసి సీరియల్‌ సెట్‌కి వెళ్లేదాన్ని.  17 ఏళ్లకు తొలిసారి నటించా. ఆ తర్వాత దేవాంక్‌ పటేల్‌తో గుజరాతీ సినిమా చేశా’’ అని సిద్ధి ఇద్నాని అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి.మురళీ కృష్ణ(మను) దర్శకత్వంలో రవి, జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్‌ నిర్మించిన ‘జంబ లకిడి పంబ’ ఈ నెల 22న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ– ‘‘ఓ వైపు సీరియల్స్, కమర్షియల్‌ యాడ్స్‌ చేస్తుండగా ఓ ఏజెన్సీ వాళ్లు ఫోన్‌ చేసి తెలుగు సినిమా ఉందని చెప్పారు. ఆడిషన్‌కి వెళ్లాను. రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌కి రమ్మని పిలిచారు. మనుగారు, నిర్మాతలు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నా కళ్లు, నవ్వు చూసి నేను చేస్తానని వాళ్లు నమ్మి ‘జంబ లకిడి పంబ’ లో అవకాశం ఇచ్చారు. నేను ఫస్టాఫ్‌లో డిజైనర్‌గా కనిపిస్తాను. ఇంటర్వెల్‌ తర్వాత పాత్రలు మారతాయి. ఓ అమ్మాయి అబ్బాయిగా నటించడం అంత ఈజీ కాదు. నా దృష్టిలో యాక్టింగ్‌ అంటే యాక్టింగే. భాష కన్నా భావాలు ఎక్కువగా మాట్లాడుతాయి. కామెడీ చేయడం చాలా కష్టం. భాష తెలియకపోతే మరీ ఇబ్బంది. అందుకే భాష నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు తెలుగు తెలుసు. ప్రస్తుతం కథలు వింటున్నా. ‘జంబ లకిడి పంబ’ విడుదల తర్వాత కొత్త చిత్రాలకు సంతకం చేస్తా’’ అన్నారు.

మరిన్ని వార్తలు