బాండ్‌ 0025

28 Apr, 2019 03:46 IST|Sakshi
డానియల్‌ క్రెగ్‌

‘మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌. జేమ్స్‌ బాండ్‌’ అంటూ 57 ఏళ్లుగా, 24 సినిమాలతో అలరిస్తోంది ‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌. లేటేస్ట్‌గా సిల్వర్‌ జూబ్లీ సినిమాకు రెడీ అయింది బాండ్‌ సిరీస్‌. గత నాలుగు సినిమాల్లో బాండ్‌గా యాక్ట్‌ చేసిన డానియల్‌ క్రెగ్‌ ఇందులోనూ హీరోగా యాక్ట్‌ చేయనున్నారు. జమైకా విల్లాలో బాండ్‌ సృష్టికర్త ఐయాన్‌ ఫ్లెమింగ్‌ 25వ సినిమాలోని నటీనటులను అనౌన్స్‌ చేశారు. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆస్కార్‌ అవార్డ్‌ విజేత రామీ మలేక్‌ విలన్‌గా నటించనున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్‌ బాండ్‌ గాళ్స్‌గా కనిపిస్తారు. సినిమా టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 8న రిలీజ్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు