కటౌట్లు పెట్టొద్దు

21 Jan, 2019 06:57 IST|Sakshi

ఏ హీరో అయినా తన సినిమా రిలీజ్‌ రోజు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఉండాలని కోరుకుంటాడు. ఎన్ని కటౌట్లుంటే అంత స్టార్‌డమ్‌ ఏర్పరచుకున్నట్టు లెక్క. కానీ తమిళ నటుడు శింబు మాత్రం తన తర్వాతి సినిమా నుంచి కటౌట్లు ఏర్పాటు చేయొద్దని ఫ్యాన్స్‌ని కోరారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం రీమేక్‌ ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’ సినిమాలో నటì ంచారు శింబు. ఈ చిత్రానికి సుందర్‌ సి. దర్శకుడు. మేఘా ఆకాశ్, కేథరీన్‌ థెరీసా కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు శింబు. ‘‘నా సినిమా రిలీజ్‌ అని పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు కట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృథా చేయకండి. దానికి బదులు మీ ఇంట్లో వాళ్లకు కొత్త దుస్తులు కొనండి, చిన్నపిల్లలకు చాక్లెట్లు కొనండి. అప్పుడు నేనింకా హ్యాపీగా ఫీల్‌ అవుతాను’’ అని శింబు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు