కళాకారుడి విజయాన్ని మరణం ఆపలేదు

19 Jun, 2020 08:18 IST|Sakshi

కళాకారుడి విజయాన్ని మరణం ఆపలేదని నటుడు శింబు పేర్కొన్నారు. సినిమారంగంలో నెలకొంటున్న ఆత్మహత్యలు, కరోనా మరణాలపై శింబు స్పందిస్తూ మీడియాకు ఒక లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొంటూ చాలా బాధాకరమైన రోజులు నడుస్తున్నాయని అన్నారు. నటుడు సేతు, చిరంజీవి సార్జా నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌ తదితరుల మరణాలు తనను చాలా బాధించాయని అన్నారు. వారు ముగ్గురూ తనకు మంచి మిత్రులని పేర్కొన్నారు. వారి మరణం తనకే కాకుండా సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. వారి ఆత్మ భగవంతుడి ఒడికి చేరాలని కోరుకుంటున్నానన్నారు. ఆ నటుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.

మరో విషయం ఏమిటంటే నటుడు సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన దిల్‌ పే చురా చిత్రాన్ని సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ చెప్పినట్లుగా థియేటర్లలో విడుదల చెయ్యాలని అన్నారు. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించి మరణాలు విజయాన్ని ఆపలేవన్నది నిరూపించాలని అన్నారు. ఈ కరోనా కాలంలో ఎక్కడ చూసినా అంబులెన్సులు మోతలు, మరణాల ఏడుపులే వినిపిస్తున్నాయి అన్నారు. కరోనా బాధింపు మరణాల కుటుంబాలకు ఈ సందర్భంగా గా తన ఓదార్పును చెబుతున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ వ్యాధి వలన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు భీతి చెందడమే పెద్ద రోగం అన్నారు. చదవండి: శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్‌

ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. సునామి గజా తుపాన్‌ వంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఇంతకుముందు ఎదురొడ్డి విజయం సాధించామని అన్నారు కాకపోతే కరోనా కాలంలో బాధితులను ప్రత్యక్షంగా కలిసి, సాయం చేయలేని పరిస్థితి అని అన్నారు. ఇప్పుడు ధైర్యం చెప్పుకోవాలని అన్నారు. ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని  హితవు పలికారు. అందరం ముఖానికి మాసు్కలు, చేతులకు బ్లౌజులు ధరించి ఈ కరోనా మహమ్మారి సమాజానికి సోకకుండా తరిమి కొడతామని నటుడు శింబు అన్నారు. చదవండి: హీరో విజయ్‌ రాజకీయ రంగప్రవేశం?

మరిన్ని వార్తలు