గాయని, నటికి తీవ్ర అనారోగ్యం

25 Oct, 2019 08:06 IST|Sakshi
గాయనీ, నటి పరవై మునియమ్మ

కీడ్నీ, గుండె సంబంధిత సమస్యలు

వైద్య ఖర్చుల కోసంకుటుంబ సభ్యుల వేడుకోలు

సాయం చేయాలని సినీ ప్రముఖులను అభ్యర్థించిన వైనం

ప్రభుత్వానికీ విన్నపం

చెన్నై,పెరంబూరు: గ్రామీణ పాటల గాయని, నటి పరవై మునియమ్మ తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.  వైద్యానికి ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వం, సినీరంగం సాయం కోసం ఎదురు చూస్తోంది. వైద్యసాయం అందించాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మధురై జిల్లా, వాడిపట్టి సమీç ³ంలోని పరవై ప్రాంతానికి చెందిన గ్రామీణ పాటల గాయని పరవై మునియమ్మ. ఈమె 2003లో విక్రమ్‌ నటించిన దూళ్‌ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. ఆ చిత్రంలో సింగం పోల అనే పాటతో ప్రాచూర్యం పొందారు. వరుసగా పలు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిం చే అవకాశాలు వచ్చాయి. అలా 80 చిత్రాల్లో నటించించారు. చివరిగా 2014లో శివకార్తీకేయన్‌ చిత్రం మాన్‌కరాటేలో నటించింది.

ఆ తరువాత ఆరోగ్యం సహకరించకపోవడంతో నటనకు దూరమైంది. పాటలు పాడే అవకాశాలు రాకుండా పోయా యి. పరవై మునియమ్మ భర్త గతంలోనే కన్ను మూశారు. వీరికి నలు గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇందులో వికలాంగుడైన ఒక కొడుక్కి మినహా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పరవై మునియమ్మ పేదరికంతో సొంత ఊరులోనే ఉంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆమె పేరుతో రూ.6 లక్షల వరకు బ్యాంక్‌ ఖాతాలో జమచేశారు. నెలకు రూ.6 వేల వరకు వడ్డీ వస్తోంది. ఆ డబ్బుతో జీవితాన్ని వెళ్లబుచ్చుతున్న ఆమెకు ఇటీవల జబ్బు చేసింది. మధురైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చింది. వైద్యులు ఆమెకు మూత్రపిండాలు, గుండె సమస్యలున్నట్లు నిర్ధారించారు. ఆర్థిక స్థోమత లేక మునియమ్మను కుంటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వానికి, సినీపరిశ్రమ వర్గాల వారిని ఆమె కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్‌

నాలోని నన్ను వెతుక్కుంటా!

విద్యార్థి నేత జీవితం

ఈసారి చిరంజీవి హోస్ట్‌!

ఓ చిన్న ప్రయత్నం

మళ్లీ ఆట మొదలు

వినోదాల జాతిరత్నాలు

హిట్‌ షురూ

ఫిబ్రవరిలో వస్తాం

బెంగళూరు భామ

జాబిలమ్మ ముస్తాబు

సంగీతంలో సస్పెన్స్‌

రాజమండ్రికి భీష్మ

చలో కేరళ

మరో రీమేక్‌లో...

మీటూ మార్పు తెచ్చింది

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం

ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ 9లో 'అమెరికన్‌ రాపర్‌'

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌

బాహుబలికి ముందు ఆ సినిమానే!

ఇండియన్‌-2: సేనాపతిగా కమల్‌ లుక్‌ ఇదే!

అసభ్యంగా తాకాడు: నటి షాకింగ్‌ కామెంట్స్‌

అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్‌’ గ్యారెంటీ!!

మహేష్‌బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!

విలన్‌ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

బిగిల్‌కు తప్పని ఆంక్షలు

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్‌

నాలోని నన్ను వెతుక్కుంటా!

విద్యార్థి నేత జీవితం

ఈసారి చిరంజీవి హోస్ట్‌!

ఓ చిన్న ప్రయత్నం

మళ్లీ ఆట మొదలు