వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

2 Apr, 2020 15:26 IST|Sakshi

క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఇంట్లో ఉండండి, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించండి అంటూ పాట క‌ట్టి మ‌రీ చెప్తున్నారు సెల‌బ్రిటీలు. అలా క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే పాట‌లు ఈ మ‌ధ్య చాలానే పుట్టుకొచ్చాయి. తాజాగా ప్ర‌ముఖ‌ ర్యాప్‌ సింగ‌ర్ ఎమీవే బంతాయ్ జ‌నాల‌ను చైత‌న్య‌ప‌ర్చిందేకు పూనుకున్నాడు. క‌రోనాను ఖ‌తం చేద్దాం అంటూ పాట ద్వారా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు. అయితే ఈ విప‌త్తుకు మాన‌వ త‌ప్పిదాలు (ప్ర‌క‌`తి విధ్వ‌సం వంటివి) కార‌ణ‌మ‌న్న విష‌యాన్ని ఎత్తి చూపాడు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ "జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించండి" అని కోరుతున్న క్లిప్పింగ్‌ను కూడా పొందుప‌రించాడు. సినిమా, కార్టూన్స్‌, వైర‌ల్ వీడియోల‌ స‌న్నివేశాల‌ను ఈ పాట‌లో వినియోగించాడు. (లెటజ్‌ ఫైట్‌ కరోనా)

ఓవైపు క‌రోనా పార‌ద్రోల‌మ‌ని సూచ‌న‌లిస్తూనే మ‌రోవైపు అందుకోసం అందుకు విశేషంగా కృషి చేస్తున్న పోలీసులు, వైద్య సిబ్బందిని కొనియాడాడు. మ‌న‌మే సైనికులుగా మారి ఇంట్లోనే ఉండి పోరాడుదాం అని కోరాడు. అంతిమంగా "క‌రోనా గురించి భ‌య‌ప‌డ‌కండి.. ఇంట్లో ఉండి దాన్ని అంత‌మొందించండి" అని పిలుపునిచ్చాడు. ఈ పాట‌కు సైక్ సంగీతం అందించాడు. మూడు నిమిషాల 17 సెకండ్ల నిడివి ఉన్న ఈ సాంగ్ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మిలియ‌న్ల మందికి పైగా వీక్షించారు. కాగా ప‌లు చోట్ల‌ హ‌రిక‌థ‌, బుర్ర‌క‌థ‌, బ‌తుక‌మ్మ పాట‌ల ద్వారా కూడా క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పోలీసులు సైతం క‌రోనాపై పాట పాడిన విష‌యం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా