ఆడపిల్లను అమ్మొద్దు

17 Feb, 2020 05:29 IST|Sakshi
మంగ్లీ

ఆడపిల్ల పుట్టిందని అమ్మేస్తే? అలా అమ్మకానికి గురైన అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏం సాధించింది? అనే కథతో రూపొందిన చిత్రం ‘స్వేచ్ఛ’. ఈ కథలో అమ్మకానికి గురైన యువతిగా నటించారు గాయని మంగ్లీ. కెపీఎన్‌ చౌహన్‌ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై అంగోత్‌ రాజు నాయక్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 28న సినిమాను విడుదల కానుంది. రాజు నాయక్‌ మాట్లాడుతూ– ‘‘మంగ్లీ పాత్ర  సమాజంలో నేటి యువతులకు ఆదర్శంగా ఉంటుంది. సెంటిమెంట్, వినోదాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అన్నారు. ‘‘సృష్టికి చెట్లు ఎంత ముఖ్యమో, ఆడపిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. మంగ్లీ నటన ఈ సినిమాకి హైలెట్‌’’ అన్నారు చౌహన్‌.

మరిన్ని వార్తలు