అది కడుపు కాదయ్యో!

27 Nov, 2017 04:37 IST|Sakshi

వార్నీ... ఒక్క ఫొటో ఎంత పని చేసేసింది. పాప్‌ సింగర్‌ మైలీ సైరస్‌ని ఏకంగా ప్రెగ్నెంట్‌ చేసేసింది. దాంతో పాతికేళ్ల ఈ అమ్మాయిగారు ‘అది కడుపు కాదయ్యో...’ అని తన కడుపు చించుకుని మరీ చెప్పుకోవలసి వచ్చింది. దీనంతటికీ కారణం ఇన్‌సెట్‌లో ఓ ఫొటో ఉంది చూశారూ... అదే! మొన్న 23వ తేదీన ఆ ఫొటో దిగారు. 23న మైలీ సైరస్‌ బర్త్‌డే. అదే విధంగా అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌ డే. రెండూ కలసి రావడంతో ఇంట్లో ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి పెద్ద పార్టీ ఇచ్చారు. డైటింగ్‌... గీటింగ్‌... వంటివన్నీ పక్కన పెట్టేసి మిలీ కూడా ఫుల్లుగా లాగించేశారు.

అప్పుడు... పార్టీ చివర్లో ఫొటో దిగి ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. కడుపులో లోడ్‌ ఎక్కువ అయ్యిందేమో... పొట్ట కొంచెం పెద్దగా, చిన్న సైజ్‌ బేబీ బంప్‌ టైపులో వచ్చింది. అంతే... అక్కడి మీడియా జనాలకు డౌటొచ్చింది! ఇంకేముంది? వెంటనే ‘మైలీ సైరస్‌ ప్రెగ్నెంట్‌. కావాలంటే ఈ బేబీ బంప్‌ చూడండి’ అని వార్తలు రాసేశారు. అవన్నీ చూసిన తర్వాత అమ్మాయిగారికి కోపం రావడం కామనే కదా! కోపంలోనే ‘‘కొంచెం కూడా సభ్యత లేదా? నేను ప్రెగ్నెంట్‌ కాదు. కొంచెం ఎక్కువ తిన్నానంతే’’ అని క్లారిటీ ఇచ్చారు. అదండీ సంగతి. అన్నట్టు... మైలీ సైరస్‌ ఎవరితో డేటింగ్‌ చేస్తున్నారో? చెప్పలేదు కదూ! ‘ది హంగర్‌ గేమ్స్‌’ ఫేమ్‌ లియామ్‌ హేమ్స్‌వర్త్‌తో!!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా