కోలీవుడ్‌కు సీతమ్మ వాకిట్లో..

6 Oct, 2013 14:32 IST|Sakshi
కోలీవుడ్‌కు సీతమ్మ వాకిట్లో..

తెలుగునాట ఆనందం కురిపించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం ఇప్పుడు ఆనందం ఆనందమేగా పేరుతో కోలీవుడ్‌కు రానుంది. వెంకటేశ్‌, మహేష్‌బాబు కలసి నటించిన ఈ చిత్రంలో సమంత, అంజలి హీరోయిన్లు. ప్రకాష్‌రాజ్‌ ప్రధాన భూమిక పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్‌ తెరకెక్కించారు.

 

ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలను మనసుకు హత్తుకునేలా చూపారు. ఈ చిత్రాన్ని విజిక్రియేషన్‌‌స పతాకంపై దానపల్లి చంద్రశేఖర్‌, ప్రసాద్‌ ఆనందం ఆనందమే పేరుతో తమిళ ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిత్రంలోని పాటలను సంగీత ప్రియులను అలరించారు. తమిళ వెర్షన్‌కు ఎ.ఆర్‌.కె.రాజరాజ సంభాషణలు అందిస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి