‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’

10 Jan, 2020 18:55 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు గారాల పట్టి సితార, డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య వీరిద్దరూ కలిసి ‘ఏ అండ్‌ ఎస్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తొలుత త్రీ మార్కర్‌ ఛాలెంజ్‌ అంటూ తొలి వీడియో పోస్ట్‌ చేసిన వీర్దిదరూ.. అనంతరం పలు ఆసక్తికర వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. అంతేకాకుండా డిఫరెంట్‌ కంటెంట్‌ వీడియోలతో పాటు ఆద్యంతం వినోదభరితంగా, విజ్ఞానభరితంగా సాగే వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా సితార, ఆద్యలు ఇద్దరూ కలిసి క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందనను ఇంటర్వ్యూ​ చేశారు. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇక మహేశ్‌ సైతం ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఈ ముగ్గురి ఎనర్జీ, ఉత్సాహం తనను ఆశ్చర్యపరిచిందని ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

మహేశ్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌ బాబులు ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రేపు(శనివారం) విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌లు సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో సినిమా హిట్టు సాధించడం ఖాయమని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. 
 

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా