వేలైక్కారన్‌తో హ్యాపీ

27 Dec, 2017 10:14 IST|Sakshi

తమిళ సినిమా: వేలైక్కారన్‌ చిత్రం సాధిస్తున్న వసూళ్లతో తనకు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతోందని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన చిత్రం వేలైక్కారన్‌. మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని 24ఏఎం.స్టూడియోస్‌ పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మించారు. అనిరుద్‌ సంగీతాన్ని అందించారు.

క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఈ నెల 22వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్‌రాజ్‌ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ వేలైక్కారన్‌ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చాలా సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఈ చిత్రం ఇంతకు ముందు శివకార్తికేయన్‌ నటించిన చిత్రాలన్నిటి కంటే అధిక వసూళ్లను సాధిస్తోందని తెలిపారు. తమిళనాడులోనే కాకుండా కర్ణాటక, కేరళ ప్రేక్షకులు వేలైక్కారన్‌ చిత్రానికి విశేష ఆదరణ చూపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా కేరళలో మరో 30 స్క్రీన్స్‌ను అదనంగా పెంచారని తెలిపారు. 

ఇక ఓవర్‌సీస్‌లో వేలైక్కారన్‌కు అనూహ్య ఆదరణ లభిస్తోందని చెప్పారు. వేలైక్కారన్‌ చిత్ర వసూళ్ల గణాంకాలను బట్టి చిత్ర విజయాన్ని ట్రేడ్‌ వర్గాలు ధ్రువీకరించడం ఆనందంగా ఉందని తెలి పారు. ఒక మంచి సందేశంతో కూడిన చిత్రాన్ని తాము ఎప్పుడూ ఆదరిస్తామని ప్రేక్షకులు వేలైక్కారన్‌ చిత్రం ద్వారా మరోసారి నిరూపించారని అన్నారు. సమాజానికి కావలసిన ఒక సందేశంతో కూడిన మంచి కమర్శియల్‌ చిత్రాన్ని ప్రజల్లోకి చేరినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు మోహన్‌రాజా అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’