నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!

8 Sep, 2019 09:49 IST|Sakshi

నమ్మవీట్టు పిళ్లై చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. నటుడు శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నమ్మవీట్టుపిళ్లై. నటి అనుఇమ్మాన్యువేల్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకుడు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు డీ.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా నమ్మవీట్టు పిళ్లై చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆ చిత్ర హీరోయిన్‌ అనుఇమ్మాన్యువేల్‌ తన ఇస్‌స్ట్రాగామ్‌లో పేర్కొంది.

కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మవీట్టు పిళ్లై ఈయన ఇంతకుముందు శివకార్తికేయన్‌ హీరోగా మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ నమ్మవీట్టు పిళ్‌లై చిత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ చిత్రం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రం శివకార్తికేయన్‌కు, నటి అనుఇమ్మాన్యువేల్‌ల కెరీర్‌లకు కీలకంగా భావిస్తున్నారు.

నటుడు శివకార్తికేయన్‌ సరైన హిట్‌ చూసి చాలాకాలమైంది. ఆయన నటించిన సీమదురై, మిస్టర్‌ లోకల్‌ వంటి చిత్రాలు చాలా నిరాశపరిచాయి. ఇక నటి అనుఇమ్మాన్యువేల్‌కు కోలీవుడ్‌లో చెప్పుకోతగ్గ చిత్రం లేదు. ఇంతకుముందు రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. భారీ తారాగణంతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న నమ్మవీట్టు పిళ్లై చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ నెలలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.

Wrap! for #nammaveettupillai See you in theatres very soon 🤗

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

నయా లుక్‌

రాజకీయ రాణి

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

విలన్‌గా హాట్ బ్యూటీ!

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్‌ లుక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ