నాన్న గర్వపడేలా చేస్తా

12 Jul, 2018 01:34 IST|Sakshi
విజయ్‌ రాజా, కె.రాఘవేంద్రరావు

విజయ్‌ రాజా

‘‘మా అబ్బాయి సత్యానంద్‌గారి వద్ద యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. నేనున్న ఫీల్డ్‌లోకే తను కూడా రావడం హ్యాపీ’’ అని నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఆయన తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. కె.రమాకాంత్‌ దర్శకత్వంలో వెట్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది.   తొలి     సన్నివేశానికి డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ ఇచ్చారు.

మరో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘విజయ్‌ నన్ను సలహా అడిగినప్పుడు ‘నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్‌.. చిరంజీవిగారిలా కష్టపడు. ఆయనలా సేవాగుణం కలిగి ఉండు’ అని చెప్పా. 32 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు మా అబ్బాయ విజయ్‌ని కూడా అదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘చంద్రశేఖర్‌ ఏలేటిగారి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా డైరెక్షన్‌ చేస్తున్నా.

హారర్‌ జానర్‌లో సాగే కామెడీ థ్రిల్లర్‌ ఇది’’ అన్నారు కె. రమాకాంత్‌. ‘‘నేను హీరో అవడానికి అమ్మానాన్నల సపోర్ట్‌తో పాటు మా మామయ్య సపోర్ట్‌ ఉంది. నాన్న గర్వపడేలా చేస్తానన్న నమ్మకంతో హీరోగా తొలి అడుగు వేస్తున్నా’’ అన్నారు విజయ్‌ రాజా. రచయితలు పరుచూరి బ్రదర్స్, డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ ప్రకాష్‌ అన్నంరెడ్డి, హీరోలు శ్రీకాంత్‌ , తరుణ్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్‌ పెండ్యాల.

మరిన్ని వార్తలు