అల రీమేక్‌లో...

16 Apr, 2020 05:52 IST|Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా మొన్న సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, యస్‌. రాధాకష్ణ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా హిందీలో రీమేక్‌ కానుందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా తమిళంలోనూ రీమేక్‌ కానుందనే వార్త వచ్చింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్‌ రైట్స్‌ తీసుకుందట.  ఈ సినిమాలో శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరిన్ని వార్తలు