ఫుల్‌ ఫామ్‌

4 Nov, 2018 06:10 IST|Sakshi

కోలీవుడ్‌లో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి కథానాయకునిగా సక్సెస్‌ అయ్యారు శివ కార్తికేయన్‌. తాజాగా ఆయన హీరోగా మరో చిత్రం రూపొందనుంది. తొలి చిత్రం ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’)తోనే దర్శకునిగా మంచి పేరు సంపాదించుకున్న పీఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన వెల్లడైంది. 24స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమా నిర్మించనుంది.  ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌గా నటించనున్నారని సమాచారం. విశాల్‌ హీరోగా వచ్చిన ‘ఇరంబుదురై’ చిత్రంలో అర్జున్‌ విలన్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తారు. ఈ సినిమా కాకుండా రవికుమార్‌తో ఓ సినిమా, రాజేష్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు శివ కార్తీకేయన్‌. ఆయన నిర్మాణంలో రూపొందిన స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా ‘కణ’ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఇలా నటుడిగా, నిర్మాతగా ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు శివ కార్తికేయన్‌.

మరిన్ని వార్తలు