మళ్లీ పిలుపొచ్చింది

8 May, 2019 00:59 IST|Sakshi

కోలీవుడ్‌ నుంచి హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌కి మళ్లీ కబురొచ్చింది. రెండేళ్ల క్రితం విశాల్‌ ‘తుప్పరివాలన్‌ (2017)’లో నటించిన అనూ ఇప్పుడు శివ కార్తికేయన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా నటించనున్నారు. ‘అజ్ఞాతవాసి (2018), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018), శైలజారెడ్డి అల్లుడు’ (2018) చిత్రాల్లో నటించిన అనూ ఇమ్యాన్యుయేల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు సైన్‌ చేయలేదీ బ్యూటీ.

అయితే తమిళంలో శివకార్తికేయన్‌ హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా అంగీకరించారామె. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌ మరో హీరోయిన్‌గా నటిస్తారు. భారతీరాజా, సముద్రఖని, నటరాజన్, ఆర్కే సురేశ్, యోగిబాబు, సూరి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తారు. రూరల్‌ రొమాంటిక్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు