ఇది...స్మార్ట్ బద్ధకం

3 Oct, 2016 23:31 IST|Sakshi
ఇది...స్మార్ట్ బద్ధకం

 ‘‘వారంలో ఏడు రోజులు.. ఇరవై నాలుగు గంటలు.. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోనే కనిపిస్తోంది. చాలా మందిని గమనించా. మనుషులతో మాట్లాడడానికి వాళ్లకు టైమ్ ఉండదు. చేతిలో ఫోన్‌తో చాలా బిజీగా గడిపేస్తుంటారు’’ అన్నారు ఐశ్వర్యా రాయ్ బచ్చన్. ఈ రోజుల్లో మనుషులు, మనసుల కంటే స్మార్ట్ ఫోన్‌లకు ప్రజలు ఎక్కువ విలువిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
 
  ‘‘ఎంతమంది ఫోన్ కాసేపు పక్కన పెట్టి, కిందపడిన టిష్యూ పేపర్‌ను డస్ట్ బిన్‌లో వేస్తున్నారు చెప్పండి? నెమ్మదిగా మనుషులందరూ బద్ధకానికి అలవాటు పడుతున్నారు. ఇల్లు, ఆఫీస్, హోటల్.. ఎక్కడున్నా ఇరవై నాలుగు గంటలూ సోషల్ మీడియాలో ఉండాల్సిందే’’ అని ఐశ్వర్యా రాయ్ ప్రస్తుత సమాజంలో మనుషుల తీరును ప్రస్తావించారు. సోషల్ మీడియా మనుషులను బద్ధకస్తులను చేస్తోందన్నారు. ఈ పద్ధతి మారాలని ఐశ్వర్య ఆకాంక్షించారు.