బిగ్‌బాస్‌: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు

1 Oct, 2018 10:57 IST|Sakshi
బిగ్‌బాస్‌ విన్నర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 తెలుగు టైటిల్‌ను కౌశల్‌ గెలుచుకున్న విషయం తెలసిందే. ఆయన విజయంలో కౌశల్‌ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. గెలిపించడమే కాదు దాదాపు ఈ రియాల్టీ షోను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. సోషల్‌ మీడియా వేదికగా వీరు చేసిన హంగామ అంత ఇంత కాదు. తమ అభిమాన కంటెస్టెంట్‌ జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి హోస్ట్‌ నానిని కూడా. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్‌ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. నిజానికి ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ను సోషల్‌ మీడియానే శాసించింది. మూడు భాషల్లో తమ అభిమాన కంటెస్టెంట్స్‌ పేరిట ఏర్పాటైన ఆర్మీలే గేమ్‌ ఆడించాయి. (చదవండి: బిగ్‌బాస్‌ విజేత కౌశల్‌)

తెలుగులో కౌశల్‌ ఆర్మీ.. మళయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీలే పై చేయి సాధించాయి. మూడు భాషల్లో ఫైనల్‌ ఆదివారమే జరగగా.. మూడింట్లో ఈ ఆర్మీలే అంతిమ విజయం సాధించాయి. మలయాళంలో సబుమోన్‌ అబ్దుసమద్‌ టైటిల్‌ గెలవగా.. తమిళంలో రిత్వికా విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ మూడు ఆర్మీ గ్రూప్‌లు ఒకరికి ఒకరు మద్దతుగా ప్రచారం చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్‌లు క్యాంపెన్‌ నిర్వహించాయి. (చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్‌ ఇలా..)

గత తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌లో ఓవియా కంటెస్టెంట్‌కు మద్దతుగా తొలిసారి ఓవియా ఆర్మీ ఏర్పాటైంది. అక్కడి నుంచి తొలిసారి దక్షిణ భారత దేశంలో ఈ ఆర్మీ సంస్కృతి పుట్టుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓవియా ఆర్మీ ఆమెను గెలిపించలేకపోయింది. కానీ ఈ సారి ఏర్పాటైన ఆర్మీలు మాత్రం విజయవంతంగా తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించాయి. (చదవండి:  కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ)

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హిట్‌ మూవీ రీమేక్‌లో అనుపమా..?

బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు

రష్మిక కోలీవుడ్‌ ఎంట్రీ ఆ హీరోతోనే..!

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి వీడియో సాంగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హిట్‌ మూవీ రీమేక్‌లో అనుపమా..?

మహేష్ ‘మహర్షి’ వాయిదా

బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం

సూపర్‌ స్టార్‌ బాటలో కల్యాణ్‌ రామ్‌

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు

రష్మిక కోలీవుడ్‌ ఎంట్రీ ఆ హీరోతోనే..!