హాస్యనటులతో సంఘవి

16 Jul, 2017 04:15 IST|Sakshi
హాస్యనటులతో సంఘవి

తమిళసినిమా: హాస్య నటులు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్, గంజాకరుప్పు, యోగిబాబుతో నటి సంఘవి ఒక చిత్రంలో నటించనున్నారు. వీరితో పాటు రోషన్, హర్షిత, మెర్కురి సత్య, కేపీ.శంకర్, జీవిత, స్నేహన్‌రాజా, కేపీ.సెంథిల్‌కుమార్, బోండామణి, త్రిలోక్, వి.రాజా, ఆర్‌.స్టాలిన్, కింగ్‌కాంగ్, రణాదేవి, ఎంఆర్‌జీ.రాజేశ్వరి, మయిలైదేవి, వీరమణి, కాదల్‌ హుస్సేన్‌ ముఖ్య పాత్రలు ధరించనున్నారు. ఈ చిత్రానికి నాన్‌యార్‌ తెరియుమా అనే టైటిల్‌ను నిర్ణయించారు.

గ్లామర్‌ సినీగైడ్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి నవీన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. నాన్‌ యార్‌ తెరియుమా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పోలీస్‌ అధికారి కావాలన్న లక్ష్యంతో చెన్నైకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఒక ఆడ దెయ్యం ప్రవేశిస్తుందన్నారు.ఆ ముగ్గురు పోలీస్‌ అధికారులు కావాలంటే ఆ దెయ్యం మూడు నిబంధనలు విధిస్తుందన్నారు. వాటిని సవాల్‌గా తీసుకున్న ఈ ముగ్గురు పోరాటంలో పడే బాధలను వినోదభరితంగా తెరకెక్కించనున్న చిత్రం నాన్‌ యార్‌ తెరియుమా అని తెలిపారు. దీనికి చంద్రన్‌సామి ఛాయాగ్రహణం, రశాంత్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం