ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి

7 Oct, 2017 01:09 IST|Sakshi

‘‘దర్శకుడు తండ్రయితే నిర్మాత తల్లి. నటీనటులు వారి పిల్లలు. సినిమా అన్నది ఒక కుటుంబం. ఈ కుటుంబం బాగుండాలంటే ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అని నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మానస్‌ హీరోగా, నిత్యానరేష్, కారుణ్య హీరోయిన్లుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ నిర్మించిన చిత్రం ‘సోడ.. గోలీసోడ’. భరత్‌ మధుసూదనన్‌ స్వరకర్త.

ఈ సినిమా పాటల సీడీని హరికృష్ణ రిలీజ్‌ చేసి, నిర్మాత రాజ్‌ కందుకూరికి అందించారు. హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలి. సినిమా మీద మక్కువతో సత్యసింధుజ ఈ చిత్రం నిర్మించారు. మానస్‌ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’అన్నారు. ‘‘నా మొదటి సినిమాలో మానస్‌ విలన్‌గా నటించాడు. తను మంచి నటుడే కాదు.. మంచి డ్యాన్సర్‌ కూడా. ఈ సినిమా సక్సెస్‌ కావాలి’’ అన్నారు హీరో నవీన్‌చంద్ర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా