కామెడీ సోడా

27 Mar, 2017 02:19 IST|Sakshi
కామెడీ సోడా

మానస్, కారుణ్య, మహిమా అలేఖ్య ముఖ్య తారలుగా హరిబాబు మల్లూరి దర్శకత్వంలో ఎస్‌.బి. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై భువనగిరి సత్య సింధూజ నిర్మించనున్న ‘సోడా గోలీసోడా’ ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత సత్య సింధూజ క్లాప్‌ ఇవ్వగా, స్వామిగౌడ్‌ కెమేరా సిచ్చాన్‌ చేశారు. నటుడు శివాజీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సమాజంలో పరిస్థితులను ఆవిష్కరించే సందేశాత్మక చిత్రమిది.

ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం. పాలకొల్లు, హైదరాబాద్‌లలో టాకీ, అవుట్‌ డోర్‌లో సాంగ్స్‌ షూటింగ్‌ చేస్తాం’’ అన్నారు హరిబాబు మల్లూరి. ‘‘మంచి చిత్రాలు అందించాలనే సంకల్పంతో నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నం ఈ సినిమా’’ అన్నారు సత్య సింధూజ. నిర్మాత రాజ్‌ కందుకూరి, మానస్‌ తల్లి పద్మిని తదితరులు పాల్గొన్నారు.