నటికి అసభ్య సందేశం.. స్ట్రాంగ్‌ రిప్లై

12 Mar, 2018 14:14 IST|Sakshi
సోఫియా హయత్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సినిమా :  ఇంగ్లీష్‌ టీవీ షోలతో పాపులర్‌ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్‌ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33)‌. అయితే పెద్దగా సక్సెస్‌ రాకపోవటంతో సినిమాలకు గుడ్‌ బై చెప్పేసిన ఈ బ్రిటీష్‌ సింగర్‌ ఆ మధ్య సన్యాసం స్వీకరించి ఆమె వార్తల్లో నిలిచారు. 

మళ్లీ ఏమనిపించిందో ఏమో బాయ్‌ ఫ్రెండ్‌తో డేటింగ్‌ చేసి అతన్ని వివాహం చేసుకుంది. తర్వాత భర్తతో తరచూ హాట్‌ ఫోటోలు పెడుతూ.. చీప్‌ ట్రిక్స్‌ చేస్తోందంటూ ఫాలోవర్స్‌ నుంచి ఛీత్కారాలను ఆమె ఎదుర్కున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం చేశాడు. అది చూసి చిర్రెత్తుకొచ్చిన ఆమె అందుకు ప్రతిగానే బదులు ఇవ్వగా.. అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

అభిషేక్‌ సింగ్‌ అనే వ్యక్తి సోఫియాతో ఒక రాత్రి తనతో గడపాలని.. అందుకు రూ. 20 లక్షలు ఇస్తానంటూ ఆమెకు ఆఫర్‌ ఇచ్చాడు. అంతే ఆమెకు కోపం తెప్పించింది. ఆపై దానిని స్క్రీన్‌ షాట్‌ తీసి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వ్యక్తికి సరైన సమాధానం ఇచ్చావ్‌ శభాష్‌.. అంటూ సోఫియా ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

                                   సోఫియా చేసిన పోస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు