ఒకరు బికినీలో.. ఒకరు నగ్నంగా ఐస్ బకెట్ ఛాలెంజ్

30 Aug, 2014 09:01 IST|Sakshi

ఏఎల్ఎస్ వ్యాధి నివారణ పరిశోధనల కోసం మొదలుపెట్టిన ఐస్ బకెట్ ఛాలెంజ్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. సెక్సిణి పూనమ్ పాండే బికినీ ధరించి ఈ ఛాలెంజ్లో పాల్గొనాలని నిర్ణయించుకుంటే.. సోఫియా హయత్ ఆమెను మించిపోయింది. తాను పూర్తి నగ్నంగా మారి ఈ ఛాలెంజిని స్వీకరించింది.

ఒక బీచ్ కుర్చీ మీద నగ్నంగా పడుకొని ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది. తాను ఈ ఛాలెంజ్ని స్వీకరించిన తర్వాత.. గౌహర్ఖాన్ను సవాలు చేస్తూ నామినేట్ చేసింది. అయితే, ఆ తర్వాత గౌహర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, తన సవాలును వెనక్కి తీసుకుంది.

పూనమ్ పాండే టూ పీస్ బికినీ ధరించి ఐస్ బకెట్ ఛాలెంజ్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్.. ఈ ఖాన్ల త్రయాన్ని సవాలు చేసింది. ఎప్పుడూ హాట్గా పోజులిచ్చే పూనమ్ పాండే.. ఈ ఛాలెంజ్ స్వీకరించే సమయంలో మాత్రం చాలా చల్లగా అనిపించిందట.