నవ్వులు పంచే సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌

28 Dec, 2019 00:14 IST|Sakshi
రాజశేఖర్‌ రెడ్డి, శేఖర్‌ రాజు

‘‘నాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. హైదరాబాద్‌లో 2500 నెలసరి జీతంతో ఓ గ్లాస్‌ మార్ట్‌లో పనిచేశా.  ఆ పనిలోని మెళకువలు నేర్చుకుని శేఖర గ్లాస్‌మార్ట్‌ను స్థాపించి ప్రస్తుతం మూడు చోట్ల 90 మంది సిబ్బందితో సంస్థని నడుపుతున్నాను’’ అని నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు అన్నారు. సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. కె.శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.శేఖర్‌ రాజు మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్‌ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రం నిర్మించా.

సుధీర్‌కు ఇది మంచి సినిమా అవుతుంది. ఈ ఇయర్‌ ఎండిగ్‌ని మా సినిమా చూస్తూ ఆడియ¯Œ ్స ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘రైటర్‌గా నా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. 10 సంవత్సరాల క్రితం కథలు పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరి గాను. ఫైనల్‌గా మా గురువు సంపత్‌ నందిగారి దగ్గర అసిస్టెంట్‌ రైటర్, కో డైరెక్టర్‌గా పని చేశాను. పోసాని కృష్ణమురళి, కోన వెంకట్‌గారి దగ్గర కూడా పనిచేశాను. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రానికి రచయితగా పని చేశాను. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. కరెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ పాయింట్‌ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం

కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయ‌ని

భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

సినిమా

భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..