నిరాడంబరంగా సోహా, కునాల్ పెళ్లి

25 Jan, 2015 23:39 IST|Sakshi
నిరాడంబరంగా సోహా, కునాల్ పెళ్లి

బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన ప్రేమజంటల్లో కునాల్ ఖేము, సోహా అలీఖాన్‌ల జోడీ ఒకటి. ఈ ఇద్దరి బంధం ఎన్నాళ్లో? అని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ జంట తమ లవ్‌ని మ్యారేజ్ వరకూ తీసుకెళ్లింది. ఆదివారం ఈ ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. సోహా సోదరుడు సైఫ్ అలీఖాన్ దగ్గరుండి మరీ తన చెల్లెలి పెళ్లి జరిపించారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో సైఫ్ అలీఖాన్ కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. సోహా, కునాల్ జంటగా నటించనున్న ‘గాయల్-2’ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.