రంగోలికి సోనా మద్దతు.. సెలబ్రిటీల ఫైర్‌!

17 Apr, 2020 11:42 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌ ట్విటర్‌ ఖాతా తొలగింపుపై బాలీవుడ్‌ ప్రముఖులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గాయని సోనా మోహపత్రా మాత్రం దానిని ఖండించారు. దీంతో ఆమెపై సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కంగనా ఆమె సోదరి రంగోలిలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే హక్కు ఉందంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా వెంటనే ఒకసారి ఆలోచండి #వోక్‌సభ’ అంటూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. అదే విధంగా ‘‘ఏ విషయాన్ని అయినా లోతుగా చూసే ప్రపంచంలో మనమంతా జీవిస్తున్నాము. ఇక్కడ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకిభవించరు. దేశ పురోగతికి ఇది చెత్త ఫార్ములా. ఇక రంగోలీ ట్విటర్‌ ఖాతాను బలవంతంగా తొలగించి మరింత ద్వేషాన్ని స్వాగతించారు’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. (రంగోలి ట్విటర్‌ అకౌంట్‌ను తొలగించిన అధికారులు)

ఇక సోనా మోహపత్రా ట్వీట్‌కు దర్శకురాలు రీమా కగ్టి, రంగోలీ ట్వీట్‌ను షేర్‌ చేస్తూ..  ‘‘సోనా మీరు దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఈ ట్వీట్‌ను  మీరు చుశారో లేదో నాకు తెలియదు.  అయితే ఈ ట్వీట్‌ను ఓసారి చూడండి. ఇందులో ఒక నిర్థిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను, నిర్థిష్టమైన పత్రికలను మారణ హెమానికి పిలుపునిచ్చింది. ఇది నేరం. ఆమోద యోగ్యం కానిది’’ అంటూ సోనా ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సోనమ్‌ మరో ట్వీట్‌ చేస్తూ  ‘‘అవును ఇప్పుడే ఆ వివాదస్పద ట్వీట్‌ను చుశాను. అయితే దీనికి రద్దు చేయడమే పరిష్కారం కాదు. ఇలాంటి పద్దతిని సమర్థించను. ఎలాంటి వారినైనా క్షమించి వారి ఉదారవాదాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’’ అని వివరణ ఇచ్చారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు)

కాగా ఫైర్‌ బ్రాండ్‌ రంగోలి తన అభిప్రాయాలను సోషల్‌ మీడయాలో తెలుపుతూ ఏప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్‌ మీడియాను కాల్చి చంపాలని రంగోలి తన ట్వీట్‌ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో ఆమె ట్విటర్‌ ఖాతాను అధికారులు గురువారం రద్దు చేశారు. 

>
మరిన్ని వార్తలు