అవసవరమే!

6 Sep, 2018 00:29 IST|Sakshi
సోనాలీ బింద్రే

‘నచ్చి చేసే తప్పుల్లో అందంగా కనిపించాలనే ఆలోచన’ నాకు నచ్చినది అని దర్శకుడు ఆల్‌ ప్యాచినో ఎప్పుడో అన్నాడు. ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని పాటిస్తున్నారు సోనాలీ బింద్రే. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌ వ్యాధికి లండన్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా జుత్తు కత్తిరించుకుని, గుండు చేయించుకున్నా ఇబ్బంది పడకుండా ఫొటోలకు ఫోజులిచ్చారామె. లేటెస్ట్‌గా అందంగా కనిపించడం కోసం విగ్‌ (సవరం) ధరిస్తున్నారట. ఆ విషయాన్ని సోనాలి తెలియజేస్తూ ఓ లేఖ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘ఆల్‌ ప్యాచినో చెప్పినమంత్రంతో ఇప్పుడు ఏకీభవిస్తున్నాను.

కానీ, అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు?  మనం ఎలా కనిపిస్తున్నామో అన్న విషయం మనపై సైకలాజికల్‌ ఎఫెక్ట్‌ ఉండనే ఉంటుంది. కొంచెం అందంగా కనిపించాలనుకోవడం ఎవరికీ పెద్ద హాని కాదు. మనకి ఆనందాన్ని ఇచ్చేదేంటో తెలుసుకోవాలి. విగ్‌ వాడదాం అనుకున్నప్పుడు నాకో చిరు సందేహం వచ్చింది. ఆకర్షణీయంగా కనిపించడానికి నేను ఎందుకింత ఆరాటపడుతున్నానని. బహుశా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ఉండటం వల్లనేమో? ఒక్క క్షణం ఆలోచించి, నాకు బావుంటుంది అనుకొని విగ్‌ ధరించదలిచాను. మనకేది సూట్‌ అవుతుందో.. ఏది నచ్చుతుందో అన్నదే ముఖ్యం.  ఈ కొత్త హెయిర్‌ డ్రెస్సర్‌ని పరిచయం చేసినందుకు థ్యాంక్యూ ప్రియాంకా చోప్రా’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు