ముహూర్తం కుదిరిందా ?

10 Apr, 2018 01:25 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌కి పెళ్లి ఘడియలు సమీపించాయన్న వార్తలు బీటౌన్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ముహూర్తం డేట్స్, ప్లేస్‌ కూడా ఫిక్స్‌ అయ్యాయని బాలీవుడ్‌ ఖబర్‌. తన బాయ్‌ఫ్రెండ్‌ ఆనంద్‌ అహుజాతో స్విట్జర్లాండ్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట సోనమ్‌కపూర్‌. మే 11, 12 తేదీల్లో ఆనంద్‌–సోనమ్‌ల వివాహం జరగనుందనీ, అందుకు ఏర్పాట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్‌ చేశారని సమాచారం.

బీటౌన్‌ ఇండస్ట్రీలో కపూర్‌ ఫ్యామిలీ కాస్త పెద్దదే. బోనీకపూర్, సంజయ్‌ కపూర్, అనిల్‌ కపూర్‌ వంటి బిగ్‌ సినీ సెలబ్రిటీలతో పాటు అర్జున్‌ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ వంటి కుర్రకారు ఉన్నారు. సో.. కపూర్‌ ఫ్యామిలీ అంతా మ్యారేజ్‌ టైమ్‌కి మూవీ షూటింగ్స్‌కు ఇబ్బంది లేకుండా ప్లాన్‌ చేసుకుంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఆనంద్‌ అహుజా ఫ్యామిలీ మెంబర్స్, కపూర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కొందరు ఢిల్లీ నుంచి, మరికొందరు ముంబై నుంచి స్టారై్ట స్విట్జర్లాండ్‌ చేరుకునేలా ప్లాన్‌ చేస్తున్నారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు