పెళ్లికళ వచ్చేసింది

3 May, 2018 02:10 IST|Sakshi
వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌, సోనమ్‌ కపూర్

మే 8... మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12:30. ఈ డేట్‌ అండ్‌ టైమ్‌ స్పెషాల్టీ ఏంటీ అనుకుంటున్నారా? బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌కు శ్రీమతిగా కొత్త జీవితం ఆరంభమయ్యే ముహూర్తపు టైమ్‌ అది. అవును.. ఇక నో మోర్‌ డౌట్స్‌. సోనమ్‌ కపూర్, ఆనంద్‌ ఆహుజాల వివాహం మే 8న ముంబైలో జరగనుంది. అన్నట్లు ఇంకో మాట.. ఆఫ్టర్‌ మ్యారేజ్‌ ఎలాగూ లంచ్‌ ఉంది. అలాగే అదే రోజు రాత్రి పార్టీ కూడా ఎరేంజ్‌ చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఆల్రెడీ సోనమ్‌ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ ఇదే అంటూ సోషల్‌ మీడియాలో ఒకటి వైరల్‌ అయ్యింది.

పెళ్లి జరగడానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నా.. అప్పుడే సోనమ్‌ కపూర్‌ ఫేస్‌లో పెళ్లి కళ వచ్చేసిందని ఆమె సన్నిహితులు సరదాగా ఆటపట్టిస్తున్నారట. ఆల్రెడీ సోనమ్‌ కపూర్‌ ఇల్లు పెళ్లి ఏర్పాట్లతో హడావిడిగా మారింది. అలంకరణ కూడా పూర్తి అయ్యింది. పెళ్లి వేడుకలకు ధరించబోయే డిజైనర్‌ డ్రెస్సులను తన అభిరుచికి తగ్గట్టుగా చేయించుకున్నారట సోనమ్‌. ‘ఫ్యాషన్‌ ఐకాన్‌’ అని పేరు తెచ్చుకున్న సోనమ్‌ పెళ్లి వేడుకల్లో ధరించబోయే దుస్తులు ఎలా ఉంటాయో చూడాలని చాలామంది వెయిటింగ్‌. ఇక సోనమ్‌ కపూర్‌ కాబోయే భర్త ఆనంద్‌ ఆహుజా గురించి చెప్పాలంటే ఆయన వ్యాపారవేత్త.

సోనమ్‌ పెళ్లికి దీపిక రాదా?
యస్‌.. సోనమ్‌ పెళ్లికి దీపికా పదుకొన్‌ హాజరు కావడం లేదా? అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అందుకు తగ్గట్లు ఒక విశ్లేషణను చెబుతున్నాయి. టైమ్‌ మ్యాగజీన్‌ వంద మంది మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్షియల్‌ పీపుల్స్‌లో ఒకరుగా దీపికా పదుకొన్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న టైమ్‌ మ్యాగజీన్‌ జరపనున్న ఓ ఈవెంట్‌లో పాల్గొనున్నారు దీపిక. ఆ నెక్ట్స్‌ మే 8 నుంచి 19 వరకు జరగనున్న కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనాల్సి ఉందట. సో.. సోనమ్‌ పెళ్లికి దీపికా రావడం లేదట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు