వైరల్‌: భర్తతో సోనమ్‌ సందడి..!

28 Oct, 2019 20:57 IST|Sakshi

ముంబై: దీపావళి సందర్భంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ సందడి చేశారు. తన తండ్రి అనిల్‌ కపూర్‌ ఏర్పాటు చేసిన పార్టీలో సోనమ్‌ భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ, సైఫ్‌ అలీ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌లతో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. అయితే సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజా పార్టీలో సందడి చేస్తూ.. అటు ఇటు కలియదిరుగుతూ.. మీడియా ఛానెల్‌ పాపారాట్సీలకు, పార్టీలోని గెస్ట్‌లకు లడ్డూలు పంచుతూ.. ఒకింత రెట్టింపు ఉత్సాహంతో అందరికి హ్యపీ దీపావళి అని శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానులను అలరిస్తోంది. ఇక మిగతా బాలీవుడ్‌ ప్రముఖులు దీపావళి సంబరాల్లో మునిగిపోతూ.. వేర్వేరు చోట్ల ఫోటోలకు పోజిచ్చారు. 

@anandahuja #with #wife @sonamkapoor at #anilkapoor Diwali Bash in #Mumbai . #happydiwali #diwali #celebrations #festival #lights #colourful #gogreen #nopollution #yogenshah @yogenshah_s @anilskapoor

A post shared by yogen shah (@yogenshah_s) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా