బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై హీరోయిన్‌లు ఫైర్‌

9 Jan, 2020 16:58 IST|Sakshi

బ్రిటీష్‌​ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యంపై హీరోయిన్‌లు సోనమ్‌ కపూర్‌, పూజా హెగ్డేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సంస్థ తీరు ఏం బాగోలేదని మండిపడ్డారు. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ రెండు సార్లు తన బ్యాగ్‌ పోగొట్టిందని తెలిపిన సోనమ్‌.. మరోసారి అందులో ప్రయాణించబోనని స్పష్టం చేశారు. ‘ఈ నెలలో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించడం ఇది మూడోసారి.. అందులో రెండుసార్లు వాళ్లు నా బ్యాగ్‌ను పోగొట్టారు. వారి చర్య నాకు గుణపాఠం నేర్పింది. ఇకపై బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించను’అని పేర్కొన్నారు.

సోనమ్‌ ట్వీట్‌పై పూజా హెగ్డే కూడా స్పందించారు.‘అవును. గత నెలలో నా బ్యాగ్‌లను కూడా వాళ్లు పోగొట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వాటిని కొరియర్‌లో పంపించారు. చూస్తుంటే.. ఇదంతా వారికి అలవాటే అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, సోనమ్‌ ట్వీట్‌పై స్పందించిన బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌.. బ్యాగేజీ విషయంలో ఆలస్యం జరుగుతున్నందుకు క్షమించాల్సిందిగా కోరింది. బ్యాగేజీ గురించి ఎయిర్‌పోర్ట్‌లో సమాచారం ఇచ్చినప్పుడు.. ట్రాకింగ్‌ సూచన ఏమైనా చేశారా అని సోనమ్‌ను అడిగింది.

ఎయిర్‌వేస్‌ ప్రశ్నలకు సోనమ్‌ బదులిస్తూ.. ‘అదంతా చేశాను.. కానీ ఆ ప్రక్రియ చాలా అసౌకర్యంగా ఉంది. ఇలాంటివి జరగకుండా.. మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా భయంకరమైన సర్వీస్‌, నిర్వహణ కూడా చెత్తగా ఉంద’ని తెలిపారు. దీనిపై ఈ ఘటనపై తాము తాము క్షమాపణలు మాత్రమే చెప్పగలమని పేర్కొంది. వీలైనంతా తొందరలో బ్యాగేజ్‌ను సోనమ్‌ వద్దకు చేరుస్తామని హామీ ఇచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపికాకు ఊరట.. ఛపాక్‌కు కాంగ్రెస్‌ బంపరాఫర్‌

ఎక్కడ వదిలేసానో అక్కడే ఉన్నాను..

యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న ట్రైలర్‌

జేఎన్‌యూ హింసపై స్పందించిన సన్నీలియోన్‌

దర్బార్‌ : మూవీ రివ్యూ

సినిమా

దీపికాకు ఊరట.. ఛపాక్‌కు కాంగ్రెస్‌ బంపరాఫర్‌

ఎక్కడ వదిలేసానో అక్కడే ఉన్నాను..

బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై హీరోయిన్‌లు ఫైర్‌

దీపికా పదుకొనేపై మరో వివాదం

హీరో బర్త్‌డే: 5 వేల కిలోల కేకు..భారీ కటౌట్‌!

పబ్లిసిటీ స్టంట్‌ అయితే ఏంటి?