లండన్‌లో తొలి బర్త్‌డే!

4 Jun, 2018 00:40 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

ఫస్ట్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను లండన్‌లో ప్లాన్‌ చేశారు బాలీవుడు బ్యూటీ సోనమ్‌ కపూర్‌. ఆల్రెడీ 32 సార్లు బర్త్‌డే కేక్‌ను కట్‌ చేసిన సోనమ్‌కి తొలి బర్త్‌డే ఏంటి బాస్‌? అంటే.. నిజమే. ఇప్పటివరకూ జరుపుకున్న బర్త్‌ డేలకు కేక్‌లను ముక్కలు చేసింది కుమారిగా. ఇప్పుడు శ్రీమతి అయ్యాక జరుపుకుంటున్న తొలి బర్త్‌డే ఇది. ఈ ఏడాది మేలో ఆనంద్‌ ఆహుజాతో సోనమ్‌ కపూర్‌ ఏడు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సోనమ్‌ పుట్టినరోజు. సోనమ్‌ 33వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ లండన్‌లో జరగనున్నాయి.

‘‘ఓ పని మీద లండన్‌ వెళ్తున్నాను. ఆనంద్‌ కూడా అక్కడికి వస్తాడు. సో.. నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా అక్కడే జరుగుతాయి. ఈ సెలబ్రేషన్స్‌లో నా సిస్టర్‌ రియా, స్నేహితులు సెహాల్యఖాన్, సయంక్తా నాయర్‌ కూడా పాల్గొంటారు. స్వర భాస్కర్‌ని జాయిన్‌ అవ్వమన్నాను. కానీ ‘వేరే వర్క్స్‌ వల్ల రాలేకపోతున్నాను’ అని స్వర చెప్పింది’’ అని సోనమ్‌ కపూర్‌ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘సంజు’, తండ్రి అనిల్‌ కపూర్‌తో  కలిసి నటిస్తోన్న ‘ఎక్‌ లడ్కీ కో దేఖా తో ఏసా లగా’ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్‌ కానున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు