‘అవును.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు’

1 Feb, 2019 20:57 IST|Sakshi
సోదరి రియాతో సోనమ్‌ కపూర్‌

అవును.. వాళ్లిద్దరూ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు అంటూ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌.. తన సోదరి రియా కపూర్‌కు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్‌ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ నా సోదరి(రియా) పెళ్లి చేసుకుంటానంటే అంతకన్నా సంతోషించే విషయం ఏముంటుంది. తనకి పెళ్లి కుదిరితే ఆ వార్త మీతో పంచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది కదా. అవును వాళ్లిద్దరు(రియా కపూర్‌- కరణ్‌ బూలానీ) పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతవరకు పెళ్లైతే చేసుకోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం నా చెల్లెలి వివాహం జరిగే అవకాశం లేదు’ అని సోనమ్‌ చెప్పుకొచ్చారు.

కాగా బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న రియా కపూర్‌, టీవీ సిరీస్‌ డైరెక్టర్‌ కరణ్‌ బూలానీలో ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నిరోజులగా రూమర్లు వినిపిస్తున్నాయి. కపూర్‌ కుటుంబానికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ కరణ్‌ భాగం కావడం వీటికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇందుకుతోడు కొన్నిరోజుల క్రితం సోనమ్‌ తల్లి సునీత కపూర్‌.. భర్త, కూతుళ్లు, కొడుకు, పెద్దల్లుడు ఆనంద్‌ అహుజాలతో పాటు కరణ్‌ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తులతో మరో కొత్త ప్రేమకథను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా’  అంటూ క్యాప్షన్‌ జతచేసి హింట్‌ ఇచ్చారు. అయితే సోనమ్‌ ఇంటర్వ్యూతో ఈ వార్త కన్ఫామ్‌ అయ్యింది.

ఇక సోనమ్‌ కపూర్‌ తన తండ్రి అనిల్‌ కపూర్‌తో కలిసి తొలిసారిగా నటించిన ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. లెస్బియన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

❤️❤️❤️❤️ #Repost @anilskapoor with @get_repost ・・・ A happy Sunday with the only humans that make me feel all warm and fuzzy inside... Celebrating yet another beautiful love story! @kapoor.sunita @anandahuja @sonamkapoor @rheakapoor @karanboolani @harshvardhankapoor

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

మరిన్ని వార్తలు