ఫ్యాషన్ రంగంలోకి స్టార్ హీరోయిన్

6 May, 2017 11:40 IST|Sakshi
ఫ్యాషన్ రంగంలోకి స్టార్ హీరోయిన్

హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ వారసురాలు సోనమ్ కపూర్, ఫ్యాషన్ ఐకాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఈ బ్యూటీ స్టైల్స్ అప్పుడప్పుడు వివాదాస్పదమవుతున్నా.. ఫ్యాషన్ దివాగా సోనమ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఇటీవల నీర్జా సినిమాతో నటిగానూ మంచి మార్కులు సాధించింది. ఈ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్న సోనమ్, వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుంది.

లేటెస్ట్ స్టైల్స్ ను బాలీవుడ్ కు పరిచయం చేసిన సోనమ్, ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడుతుంది. తన సోదరి రియా కపూర్ తో కలిసి రేసన్ అనే ఫ్యాషన్ బ్రాండ్ ను లాంచ్ చేస్తోంది. ఈ నెల 12నుంచి ఈ బ్రాండ్ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. అన్ని షాపర్ స్టాప్ స్టోర్స్ లో ఈ బ్రాండ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన సోనమ్ బిజినెస్ ఉమెన్ ఆకట్టుకుంటుందేమో చూడాలి.