ఫ్రెండ్‌ కోసం పెళ్లి తేదీ మార్చుకున్న హీరోయిన్‌

30 May, 2018 13:38 IST|Sakshi
స్వరా భాస్కర్‌, సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజా

సాక్షి, ముంబై : జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకగా భావించే వివాహానికి ప్రాణ స్నేహితులు, సమీప బంధువులు రాలేరని తెలిస్తే మనసు చిన్న బుచ్చుకోవడం సహజం. వారి కోసం వివాహ తేదీలో మార్పు చేసుకోవడమంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే సోనమ్‌ కపూర్‌ ఇందుకు మినహాయింపు. స్నేహితురాలి కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చుకున్నారు. అసలు విషయమేమిటంటే.. ఈనెల (మే) 8న తేదీన సోనమ్‌ కపూర్‌ పెళ్లి వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో జరిగిన విషయం తెలిసిందే. అయితే వారి వివాహం మార్చి 12నే జరగాల్సిందట. కానీ ఆరోజే సోనమ్‌ స్నేహితురాలు స్వరా భాస్కర్‌ సోదరుడు ఇషాన్‌ వివాహం జరగనుండడంతో.. సోనమ్‌ తల్లిదండ్రులను ఒప్పించి మరీ వివాహ తేదీని మే 8కి మార్పించారట.

తాజాగా ఈ విషయాన్ని స్వరా భాస్కర్‌ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా షూటింగ్‌ సమయంలో ఒకరోజు సోనమ్‌ చాలా డల్‌గా కన్పించింది. ఇషాన్‌ వివాహ తేదీని మార్చాల్సిందిగా నా తల్లిదండ్రులను ఒప్పించమని నన్ను అడిగింది. అలా కుదరకపోవడంతో తనే పెళ్లి తేదీని మార్చుకుని స్వీట్‌ షాక్‌ ఇచ్చిందంటూ’ స్వరా భాస్కర్‌ తమ మధ్య ఉన్న స్నేహబంధం గురించి చెబుతూ మురిసిపోయారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు