అంధురాలి పాత్రలో...

16 Nov, 2019 04:33 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

హిట్‌ రన్‌ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ సమయంలో తాను సాక్ష్యం చెబుతానని ఓ అమ్మాయి ముందుకొచ్చింది. కానీ, ఆ అమ్మాయికి చూపు లేదు. మరి.. ఈ కేసులో నిజమైన దోషులకు శిక్ష పడిందా? పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరించారు? అనే అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సౌత్‌ కొరియన్‌ మూవీ ‘బ్లైండ్‌’ (2011). ఈ సినిమా హిందీలో రీమేక్‌ కానుంది. చూపులేని యువతి పాత్రలో సోనమ్‌ కపూర్‌ నటించనున్నారని బాలీవుడ్‌ సమాచారం. ‘కహానీ’ (2012), ‘బద్లా’ (2019) చిత్రాల దర్శకుడు సుజోయ్‌ ఘోష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సుజోయ్‌ వద్ద అసిస్టెంట్‌గా వర్క్‌ చేసిన షోమీ మఖిజా ఈ  చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా