ఉక్రెయిన్లో ఖైదీ స్టెప్పులు

18 Oct, 2016 10:43 IST|Sakshi
ఉక్రెయిన్లో ఖైదీ స్టెప్పులు

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగా ప్రస్తుతం సాంగ్స్ షూట్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. టాలీవుడ్ డాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మెగాస్టార్ దాదాపు దశాబ్దకాలం తరువాత వెండితెర మీద స్టెప్పేస్తుండటంతో ఖైదీ పాటలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ కూడా సాంగ్స్ విషయంలో స్సెషల్ కేర్ తీసుకుంటోంది.

ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తో కలిసి స్సెషల్ సాంగ్ లో ఆడిపాడుతున్న మెగాస్టార్, త్వరలో డ్యూయెట్స్ కోసం ఉక్రేయిన్ వెల్లనున్నాడు. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గానటిస్తుండగా, క్లైమాక్స్ లో వచ్చే కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ శ్రియ నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లు సంయుక్తంగా ఖైదీ నంబర్ 150 సినిమాను నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి