సోనూ సూద్‌ మరోసారి ఉదారత

13 Jul, 2020 13:16 IST|Sakshi

సాక్షి, ముంబై : విలక్షణ నటుడు సోనూ సూద్‌ (46) మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.  మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాననీ వారికి మద్దతు ఇవ్వడం బాధ్యతగా భావిస్తునని సూద్ ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా అమలైన  వివిధ దశల లాక్‌డౌన్‌తో  ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇంటి బాట పట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రమాదాల్లో  పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన  సంగతి తెలిసిందే. అలాంటి వలస కార్మికుల కుటుంబాలకు సోను సూద్అండగా నిలవనున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోమవారం తాజాగా ప్రకటించారు. కాగా లాక్‌డౌన్‌ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూ సూద్‌ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది. వారికోసం చార్టర్డ్‌ విమానాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి : ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు
గుడ్‌న్యూస్‌: కరోనా డ్రగ్‌ ధర తగ్గింది

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు