సూర్య నోట రాప్‌ పాట 

21 Nov, 2019 08:59 IST|Sakshi

ఇప్పుడు హీరోలు గాయకులుగా మారడం పరిపాటిగా మారిపోయింది. విజయ్, ధనుష్, శింబు వంటి హీరోలు తమ చిత్రాలకు పాడుకుంటుంటారు. ఇక విశ్వనటుడు కమలహాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. ఇటీవల నటుడు సూర్య, కార్తీలు కూడా పాడటం ప్రారంభించారు. నటుడు సూర్య తాను నటించిన అంజాన్‌ చిత్రం కోసమే ఒక పాట పాడారు. ఇక దర్శకుడు వెంకట్‌ప్రభు పార్టీ చిత్రం కోసం సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి పాడారు. తాజాగా నటుడు సూర్య రాప్‌ పాటను పాడటం విశేషం. కాప్పాన్‌ చిత్రం తరువాత ఈయన నటిస్తున్న చిత్రం సూరరై పోట్రు. ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్‌ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రంలో అపర్ణ బాలమురళీ నాయకిగా నటిస్తోంది. 

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌బాబు, బాలీవుడ్‌ స్టార్‌ జాకీష్రాప్, కరుణాస్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సూరరై పోట్రు చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాం జరుపుకుంటోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా సూర్య అభిమానుల్లో క్రేజ్‌ను తెచ్చుకుంది. కాగా త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇందులో ధీమ్‌ ఉంటుందని, దానికి సంగీతాన్ని జీవీ సమకూర్చుతున్నారనే వార్తలు వెలువడి ఆసక్తిని రేకరెత్తిస్తున్నాయి. కాగా తాజాగా ఆ ధీమ్‌ మ్యూజిక్‌కు నటుడు సూర్యతోనే జీవీ.ప్రకాశ్‌కుమార్‌ రాప్‌ పాటను పాడించారు. దీంతో సూరరై పోట్రు చిత్రానికి మరింత క్రేజ్‌ పెరిగింది. సూర్య అభిమానులు సూరరై పోట్రు చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తరువాత సూర్య వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. అదే విధంగా గౌతమ్‌మీనన్‌తో చిత్రం చేయడానికి గ్రీస్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం ఇప్పటికే జోరందుకుంది.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా